ఎస్‌బీఐలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం | SBI appointed 505 Probationary Officers | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం

Jun 14 2025 9:32 AM | Updated on Jun 14 2025 10:01 AM

SBI appointed 505 Probationary Officers

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను కొత్తగా నియమించుకున్నట్టు ప్రకటించింది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌లో పరిశ్రమలోనే ఇదొక పెద్ద నియామకంగా పేర్కొంది. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, కార్పొరేట్‌ రుణాలు, అగ్రి బిజినెస్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, ట్రెజరీ కార్యకలపాలు, నియంత్రణలు, నిబంధనల అమలు తదితర విభాగాల్లో వీరు సేవలు అందించనున్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి: మోతీలాల్‌ ఓస్వాల్‌పై సెబీ జరిమానా

బ్యాంకులో అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు ఎదిగే అవకాశాలను ఎస్‌బీఐ వీరికి అందిస్తుందని తెలిపింది. 13,455 జూనియర్‌ అసోసియేట్లను సైతం నియమించుకున్నట్టు ఎస్‌బీఐ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మంది నియామకం చేపట్టినట్టు.. ఇందులో 13,500 మంది వరకు క్లరికల్‌ ఉద్యోగులు అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి సైతం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement