breaking news
Probationary Officers
-
ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ నేపథ్యంలో సుమారు 50,000 మందిని భర్తీ చేసుకోనున్నాయి. ఇందులో 21,000 మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా, మిగిలిన వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నారు. ప్రభుత్వరంగంలో 12 బ్యాంకులు ఉండగా, ఒక్క ఎస్బీఐనే 20,000 మందికి అవకాశం కల్పించనుంది. ఇందులో భాగంగా ఎస్బీఐ ఇప్పటికే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంది. అలాగే, 13,455 మంది జూనియర్ అసోసియేట్స్ భర్తీని సైతం చేపట్టింది. శాఖల స్థాయిలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తాజా నియామకాలు చేపట్టినట్టు ఎస్బీఐ ప్రకటించడం గమనార్హం. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని శాఖల స్థాయిలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. ఎస్బీఐలో మొత్తం ఉద్యోగులు 2025 మార్చి చివరికి 2,36,226 మంది ఉన్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్ ర్యాంకుల్లోని వారే. ఉద్యోగుల వలసలను 2 శాతంలోపునకు పరిమితం చేసేందుకు ఎస్బీఐ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పీఎన్బీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో రూ.5,500 మందిని కొత్తగా నియమించుకోనుంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎన్బీ వ్యాప్తంగా 1,02,746 మంది ఉద్యోగులున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియమించుకోనుంది. సబ్సిడరీల బలోపేతంపై దృష్టి.. సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి, వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ చేయడం ద్వారా రాబడులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆదేశించడం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా సబ్సిడరీ సంస్థల్లో బ్యాంక్‌లు అదనపు పెట్టుబడులు పెడతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాల విస్తరణతో సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. -
ఎస్బీఐలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం
భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను కొత్తగా నియమించుకున్నట్టు ప్రకటించింది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్‌లో పరిశ్రమలోనే ఇదొక పెద్ద నియామకంగా పేర్కొంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాలు, అగ్రి బిజినెస్, వెల్త్ మేనేజ్మెంట్, ట్రెజరీ కార్యకలపాలు, నియంత్రణలు, నిబంధనల అమలు తదితర విభాగాల్లో వీరు సేవలు అందించనున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: మోతీలాల్ ఓస్వాల్‌పై సెబీ జరిమానాబ్యాంకులో అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు ఎదిగే అవకాశాలను ఎస్బీఐ వీరికి అందిస్తుందని తెలిపింది. 13,455 జూనియర్ అసోసియేట్లను సైతం నియమించుకున్నట్టు ఎస్బీఐ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మంది నియామకం చేపట్టినట్టు.. ఇందులో 13,500 మంది వరకు క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి సైతం తెలిపారు. -
ఎస్బీఐలో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్స్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో) ► మొత్తం పోస్టుల సంఖ్య: 2056(రెగ్యులర్ పోస్టులు–2000, బ్యాక్లాగ్ పోస్టులు 56). ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్/డిసెంబర్ 2021 ► వెబ్సైట్: https://bank.sbi/web/careers -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ప్రొబేషనరీ ఆఫీసర్స్
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన యువ ఐఎఫ్ఎస్ అధికారుల్లో సుమన్ బెనీవాల్, వినీత్ కుమార్, జి. విఘ్నేష్ అప్పారావులు ఉన్నారు. కాగా వీరి వెంట రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఎస్. ప్రతీప్ కుమార్ కూడా ఉన్నారు.(మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్) ఎస్ఎస్ఎల్ గ్రూఫ్ రూ. 50 లక్షల విరాళం అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్ ఎస్ ఎల్ గ్రూఫ్ రూ.50 లక్షలు విరాళమందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎల్ గ్రూఫ్ చైర్మన్ ఎం. ప్రభాకర్‌రావు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చెక్కును అందించారు. ఆయన వెంట ఎండీ ఎం. వెంకరామచౌదరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అంతేగాక కోటి రూపాయల విలువైన శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు ఎన్ఎస్ఎల్ గ్రూఫ్ పేర్కొంది. -
ఎస్బీఐ కొలువుల జాతర: నోటిఫికేషన్ వచ్చేసింది
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ల (పీవో) ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ ఏప్రిల్ 21వ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. శనివారంనుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఎస్బీఐ వెబ్సైట్ అందించిన వివరాలు దరఖాస్తులు సమర్పించేందు కు చివరి తేదీ మే 13, 2018. ప్రిలిమ్స్ పరీక్ష జులై 1, 7,8 తేదీల్లో, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 4న నిర్వహించనుంది పీవో పోస్టులకు నిర్వహించే పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతో పాటు గ్రూపు డిస్కషన్స్ , ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత పొందినవారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. మెయిన్స్ కూడా పాసైతే ఆ అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
ఎస్బీఐ పీఓ కొలువులకు దారిదీ
దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొలువుల జాతరకు తెరతీసింది.. భారీ స్థాయిలో ప్రొబేషనరీ ఆఫీసర్ల (పీఓ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. చక్కని కెరీర్.. ఆకర్షణీయమైన వేతనం.. ప్రతిభకు గుర్తింపు.. వెరసి మంచి భవిష్యత్‌కు సోపానంగా నిలుస్తోంది ఎస్బీఐ-పీఓ.. పోస్టుల సంఖ్య భారీగా ఉండడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు.. ఈ నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏం చదవాలి, ఎటువంటి మెళకువలు పాటించాలి తదితర అంశాలపై విశ్లేషణ.. ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 అనే రెండు ప్రక్రియల ద్వారా. ఫేజ్-1: ఇది రాత పరీక్ష. దీన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల కలయికగా మొత్తం 250మార్కులకు నిర్వహిస్తారు. ఇందు లో మొదటగా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దీన్ని ఆఫ్‌లైన్‌గా పేపర్/పెన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. సమాధానాలు గుర్తించడానికి రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఇందులో ఉండే నాలుగు విభాగాలు.. విభాగం మార్కులు ఇంగ్లిష్ 50 జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్ 50 డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 50 రీజనింగ్ (హై లెవల్) 50 మొత్తం 200 డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్కులకు ఉంటుంది. దీని కోసం గంట సమయం కేటాయించారు. ఇది ప్రధానంగా అభ్యర్థిలోని ఆంగ్ల భాష నైపుణ్యం, రైటింగ్ స్కిల్స్‌ను పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం. ఇందులో కాంప్రెహెన్షన్, లెటర్ రైటింగ్, ఎస్సే, షార్ట్ ప్రిసెస్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ పేపర్లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ఫేజ్-2: ఈ విభాగంలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఈ రెండు దశలకు కలిపి 50 మార్కులు ఉంటాయి. ఇందులో గ్రూప్ డిస్కషన్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు. చివరగా ఫేజ్-1, ఫేజ్-2లో సాధించిన మెరిట్ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. ఈ క్రమంలో ఫేజ్-1 రాత పరీక్షకు 75 శాతం వెయిటేజీ, ఫేజ్-2కు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. పరిమితంగానే: ఎస్బీఐ పీఓ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. దీని ప్రకారం గరిష్ట వయోపరిమితికి లో బడి జనరల్ అభ్యర్థులు 4 సార్లు, ఓబీసీ/ఓబీసీ-పీడబ్ల్యూడీ 7సార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు. శిక్షణ-కెరీర్: పీఓకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో సంబంధిత విధులపై సమగ్ర శిక్షణనిస్తారు. ప్రొబేషన్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షల్లో నిర్దేశించిన ప్రమాణాలు సాధించిన అభ్యర్థులకు ఆఫీసర్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్-2 హోదానిస్తారు. అలాకాకుండా కేవలం అర్హత మాత్రమే సాధించి, నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేని అభ్యర్థులకు ఆఫీసర్ జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ గ్రేడ్-1 హోదానిస్తారు. అదే సమయంలో అర్హత సాధించని అభ్యర్థులను సర్వీస్ నుంచి తొలగిస్తారు. ఆకర్షణీయమైన పదోన్నతి విధానం ఎస్బీఐలో ఉంది. పనితీరు, ప్రతిభ ఆధారంగా స్వల్ప కాలంలోనే టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్‌కు చేరుకోవచ్చు. ఈ క్రమంలో మేనేజర్ హోదా తర్వాత దశల వారీగా.. సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్.. వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. వేతనాలు-ప్రోత్సాహకాలు: ఎస్బీఐ పీవో బేసిక్ రూ. 16,900తో ఆరంభమవుతుంది. అంటే.. వేరే బ్యాంకుల్లో నాలుగేళ్ల తర్వాత లభించే జీతం ఎస్బీఐలో కెరీర్ ప్రారంభంలోనే పొందొచ్చు. గరిష్ట వార్షిక వేతనం రూ.8,40,000. మిగతా బ్యాంకుల కంటే ఎస్బీఐలో ప్రోత్సాహకాలు అధికంగా ఉంటాయి. తక్కువ వడ్డీకి వివిధ రకాల రుణాలను పొందొచ్చు. విదేశాల్లోనూ బ్యాంక్ శాఖలు ఉన్న కారణంగా అక్కడ కూడా పని చేసే అవకాశం లభిస్తుంది. ఇంగ్లిష్: అత్యంత కీలక విభాగం ఇంగ్లిష్. ఎందుకంటే ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్ పేపర్లో కూడా ఈ విభాగం నుంచే ప్రశ్నలు ఎదురవుతాయి. ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్, క్లోజ్ టెస్ట్, కామన్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించాలంటే ప్రధానంగా గ్రామర్ మీద దృష్టి సారించాలి. వొకాబ్యులరీ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి రోజూ ఇంగ్లిష్ పేపర్ చదవడం, టీవీ వార్తలు వినడం చేయాలి. దీంతో ఏ పదాన్ని సందర్భానుసారంగా ఏవిధంగా ఉపయోగించాలో అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ 15 నుంచి 20 కొత్త పదాలు నేర్చుకోవాలి. గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్, పాసివ్ వాయిస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. జనరల్ అవేర్నెస్: జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడు విభాగాలు ఉండడంతో దీని ప్రాముఖ్యం పెరిగింది. జనరల్ అవేర్‌నెస్‌లో స్వల్ప సమయంలో ఎక్కువ ప్రశ్నలకు ఎటువంటి తార్కికత అవసరం లేకుండానే సమాధానాలను గుర్తించవచ్చు. ఈ విభాగం కోసం జాతీయ-అంతర్జాతీయంగా రాజకీయంగా, ఆర్థికంగా గత 7 నుంచి 8 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. వాటితోపాటు ప్రభుత్వ పథకాలు, వివిధ అవార్డులు, బడ్జెట్, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలు-విజేతలు, ముఖ్య వ్యక్తులు, ర చయితలు.. ఇలా విభిన్న అంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే.. బ్యాంకింగ్ రంగ విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ సాధనాలు, నియామకాలు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ, ఫైనాన్షియల్ టర్మ్స్, అకౌంటింగ్ టర్మ్స్, వివిధ కమిటీల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం ప్రిపరేషన్‌ను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. ఇందుకోసం ప్రతి రోజూ తెలుగు, ఆంగ్ల దినపత్రికలు, బిజినెస్ డైలీస్, చదవడం, బిజినెస్ చానల్స్ చూడడం ప్రయోజనకరం.కంప్యూటర్ విభాగానికి సంబంధించి ఈ-కామర్స్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ టెక్నాలజీస్, ఇన్పుట్, అవుట్‌పుట్ డివెజైస్, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ జనరేషన్లు, హార్డ్‌వేర్, ఎంఎస్ ఆఫీస్ ప్రాథమిక విభాగాలైన ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మార్కెటింగ్ విభాగంలో ముందుగా.. మార్కెటింగ్ పరిభాషను అవగాహన చేసుకోవాలి. తద్వారా సులువుగా ప్రిపరేషన్ సాగించవచ్చు. ఈ క్రమంలో సెల్లింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, బ్రాండింగ్, కో-బ్రాండింగ్ వంటి అంశాల మధ్య తేడాను తెలుసుకోవాలి. మార్కెటింగ్‌లో కీలమైన 7పీస్ (7Ps of marketing Product, Prices, Promotion, Place, Packaging, Positioning, People), సీఆర్ఎం (Customer relationship management CRM) కాన్సెప్ట్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. డేటా అనాలిసిస్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం డేటా అనాలిసిస్. ఇందులో పై చార్ట్, బార్‌గ్రాఫ్స్, టేబుల్స్, లైన్ గ్రాఫ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సింప్లిఫికేషన్, రేషియో, ప్రిపోజిషన్‌స, పర్సంటేజెస్, యావరేజెస్ వంటి ప్రక్రియలతో ముడిపడిన ప్రశ్నలు కూడా అడుగుతారు. సులభమైన భాషలో చెప్పాలంటే ఈ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రక్రియలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ ప్రక్రియల్లో పట్టుసాధించాలంటే.. వీటికి మూల స్తంభాలుగా నిలిచే 20 వరకు టేబుల్స్, 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. రీజనింగ్: అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. రీజనింగ్‌కు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇన్పుట్-అవుట్‌పుట్ నుంచి 5 ప్రశ్నలు, కోడింగ్- డీకోడింగ్ నుంచి 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు, డౌజజీటఝ నుంచి 5 ప్రశ్నలు, పజిల్ /సీటింగ్ ఆరేంజ్మెంట్ నుంచి 10 ప్రశ్నలు, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు, డెరైక్షన్-ఇతర ప్రాబ్లమ్స్ నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇచ్చిన ప్రశ్నను అవగాహన చేసుకోవడం ద్వారా సులువుగానే సమాధానం గుర్తించవచ్చు. ఇందుకు దోహదపడే అంశాలు ఏకాగ్రత, సమయస్ఫూర్తి, తార్కిక వివేచన. ఆయా అంశాలకు సంబంధించి భిన్నమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలను ఊహించుకుని ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం. డిస్క్రిప్టివ్ టెస్ట్: ఎస్సే రైటింగ్‌లో మూడు అంశాలిస్తారు. ఇవి మూడు భిన్న నేపథ్యాల్లోంచి ఉంటాయి. అందులో ఏదో ఒక దాన్ని అభ్యర్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటి టాపిక్ సాధారణంగా చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారితంగా ఉంటుంది. ఉదాహరణకు సోషల్ మీడియా, ప్రజలను చైతన్య పరచడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర వంటివి. రెండో ఎస్సే పండుగలు, సంప్రదాయాలు, ఉత్సవాలకు సంబంధించిన అంశంపై ఇస్తారు. బ్యాంకింగ్ రంగంపై మూడో టాపిక్ ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత ధోరణులు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్, రోల్ ఆఫ్ ఐఆర్డీఏ వంటివి. లెటర్ రైటింగ్‌లో పర్సనల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ అని రెండు రకాలు ఉంటాయి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే లెటర్ రైటింగ్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. లెటర్స్ రాసేటప్పుడు వాటికి సంబంధించి పాటించాల్సిన ప్రాథమిక అంశాలను (Address, Salutation, Subject, Reference, closing letter with thankవంటివి) ప్రిసెస్ రైటింగ్‌ను ప్రభావవంతంగా చేయాలంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కంజెక్షన్ విభాగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదాహరణకు “Ramesh is a well known person in the colony. He is always ready to give practical help to the people who are in trouble.” Can be abridged as “Ramesh is a good Samaritan” నోటిఫికేషన్ సమాచారం: ఖాళీలు: 1837 (జనరల్: 758, ఓబీసీ: 405, ఎస్టీ: 439, ఎస్సీ: 235) అర్హత: ఏదైగా డిగ్రీ. నిబంధనల మేరకు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఏప్రిల్ 1, 2014 నాటికి 21 నుంచి 30 ఏళ్లు. దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 28, 2014. వివరాలకు: www.statebankofindia.com www.sbi.co.in. టిప్స్ పరీక్షను మొదట జనరల్ అవేర్నెస్తో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఇందులో సమాధానం ఇవ్వడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంగ్లిష్ విభాగాన్ని ఎంచుకోవాలి. ఇందులోని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్ వంటి ప్రశ్నలను ముందుగా ప్రయత్నించాలి. ఎందుకంటే వీటికి 40 మార్కులు కేటాయించారు. రీడింగ్ కాంప్రెహెన్షన్ను చివరగా సాధించండి. బాగా ప్రాక్టీస్ చేయడమే బ్యాంక్ పరీక్షల సక్సెస్ కీ. ప్రాక్టీస్‌తోనే స్పీడ్ పెరుగుతుంది. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు రాయొచ్చు. 200 ప్రశ్నలు 120 నిమిషాలు అంటే.. ఒక ప్రశ్నకు 36 సెకన్లలో సమాధానం గుర్తించాలి. కాబట్టి స్పీడ్‌మ్యాథ్స్ రావాలి (వంద వరకు స్క్వేర్స్, 30 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి). పదోతరగతి వరకు మ్యాథ్స్‌పై పట్టుండాలి. సమయ పాలన కోసం మాక్ పరీక్షలు రాయాలి. కొన్ని ప్రశ్నలకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా సమాధానం వేగంగా రాబట్టొచ్చు. డిస్క్రిప్టివ్ పరీక్ష కోసం ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రిఫరెన్స్ బుక్స్ ఇంగ్లిష్: ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్-టాటా మెక్‌గ్రాహిల్ లేదా పియర్సన్ పబ్లికేషన్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: చాంద్ పబ్లికేషన్స్ ఆర్ఎస్ అగర్వాల్ లేదా త్రిష పబ్లికేషన్స్ రీజనింగ్: ఆర్ఎస్ అగర్వాల్ లేదా త్రిష పబ్లికేషన్స్. బీఎస్సీ పబ్లికేషన్స్ ఎస్బీఐ పాత ప్రశ్నపత్రాలు. బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్, సీఎస్ఆర్..మ్యాగజైన్లు ఆబ్జెక్టివ్ మార్కెటింగ్-అరిహంత్ పబ్లికేషన్స్ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ అవేర్నెస్-అరిహంత్ పబ్లికేషన్స్, కిరణ్ ప్రకాశణ్ -
ఉద్యోగాలు
ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 1897 (ఎస్సీ-235, ఎస్టీ-439, ఓబీసీ-405, జనరల్-758, వీహెచ్ - 29, ఓహెచ్-31) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఏప్రిల్ 1, 2014 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో చివరి తేది: ఏప్రిల్ 25 వెబ్సైట్: www.sbi.co.in