శాంసంగ్‌ కొంపముంచిన చాట్‌జీపీటీ.. లీకైన రహస్య సమాచారం

Samsung Employees Accidentally Leaked Company Secrets Via Chatgpt - Sakshi

ప్రముఖ సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన రహస్య సమాచారం చాట్‌జీపీటీ చేతికి చిక్కింది. కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా శాంసంగ్‌ ఉద్యోగులు చాట్‌జీపీటీకి అనుమతి ఇచ్చారు. ఇలా 20 రోజుల్లో మూడు సార్లు కాన్ఫిడెన్షియల్‌ డేటా చాట్‌జీపీటీకి యాక్సిస్‌ ఇవ్వడంతో తప్పిదానికి కారణమైన ఉద్యోగుల్ని సంస్థ తొలగించినట్లు తెలుస్తోంది. కానీ ఉద్యోగుల తొలగింపుపై శాంసంగ్‌ స్పందించలేదు.

సెమీ కండక్టర్‌ విభాగానికి చెందిన ఉద్యోగులకు ఆఫీస్‌ వర్క్‌ విషయంలో ఏదైనా సమస్యలు తలెత్తి వాటిని పరిష్కరించేందుకు వీలుగా చాట్‌జీపీటీని వినియోగించేందుకు శాంసంగ్‌ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కొత్త ప్రోగ్రామ్‌ గురించి సోర్స్‌కోడ్‌ కావాలని చాట్‌బాట్‌ను కోరాడు. అందుకు శాంసంగ్‌ సెమీకండక్టర్‌కు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటాను చాట్‌జీపీటీకి షేర్‌ చేశాడు. 

ఈ అంశంపై శాంసంగ్‌ సీఈవో హాన్ జోంగ్-హీ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ‘మై ద రిజిస్టిర్‌’ నివేదిక తెలిపింది. చాట్‌జీపీటీ వినియోగం విషయంలో సిబ్బంది అలసత్వం వహించరాదని వార్నింగ్‌ ఇచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు చాట్‌జీపీటీ లాంటి థర్డ్‌ పార్టీ చాట్‌బాట్‌ల అవసరం లేకుండా సొంత చాట్‌బాట్‌లను తయారు చేసే పనిలో శాంసంగ్‌ నిమగ్నమైందని రిపోర్ట్‌ హైలెట్‌ చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top