ఈ స్మార్ట్‌ వాచ్‌ స‍్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే? | Samsung Developing Non-Invasive Blood Sugar Monitor For Galaxy Watch | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ వాచ్‌ స‍్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే?

Feb 18 2024 9:41 AM | Updated on Feb 18 2024 11:01 AM

Samsung Developing Non invasive Blood Sugar Monitor For Galaxy Watch - Sakshi

డయాబెటిస్‌ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. 

ఇప్పటి వరకు డయాబెటిస్‌ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్‌ కంపెనీ ‘శామ్‌సంగ్‌’ అందుబాటులోకి తెచ్చింది. 

ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్‌ మీద చూపిస్తుంది. ‘శామ్‌సంగ్‌’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement