శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా డిజైన్ లీక్! | Samsung Galaxy S27 Ultra Design Leaks, Know About The Details Of 5,700mAh Battery, 16MP Selfie Camera And Others | Sakshi
Sakshi News home page

శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా డిజైన్ లీక్!

Oct 17 2026 4:00 PM | Updated on Oct 17 2026 4:24 PM

Samsung Galaxy S27 Ultra Design Leak Know The Details

శాంసంగ్ నుంచి వచ్చే ఆల్ట్రా సిరీస్ ఫోన్ల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇలాంటి తరుణంలో.. త్వరలో రాబోయే గాలక్సీ ఎస్27 ఆల్ట్రా(Samsung Galaxy S27 Ultra)కు సంబంధించిన కొన్ని విషయాలు లీకయ్యాయి. అయితే.. ఈసారి ఫోన్ డిజైన్ విషయంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని సమాచారం. కాబట్టి ఇది చూడటానికి గాలక్సీ ఎస్26 ఆల్ట్రా మాదిరిగానే ఉండనుంది.

టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం.. గాలక్సీ ఎస్27 ఆల్ట్రా స్క్రీన్ సైజు, అంచులు, బెజెల్స్ వంటి వాటిలో తేడా లేదని తెలుస్తోంది. అయితే 6.9 ఇంచెస్ డిస్‌ప్లే ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే 1,440 x 3,120 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందించే అవకాశం ఉంది. బయటకు కనిపించే డిజైన్ దాదాపు పాత మోడల్‌లాగే ఉన్నప్పటికీ, లోపల ఉపయోగించే డిస్‌ప్లే టెక్నాలజీలో మార్పులు ఉండవచ్చని స్పష్టమవుతోంది.

ఈ ఫోన్‌లో శాంసంగ్ కొత్త ఎం16 ఓఎల్ఈడీ ప్యానెల్‌ను ఉపయోగించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే స్క్రీన్ బ్రైట్‌నెస్, కలర్ క్వాలిటీ, బ్యాటరీ వినియోగం వంటి అంశాల్లో మెరుగుదల కనిపించవచ్చు. అలాగే ప్రైవసీ డిస్ప్లై ఫీచర్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. అయితే.. దీనిపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక సమాచారం లేదు.

అప్డేటెడ్ కెమెరా
కెమెరా విషయంలోనూ శాంసంగ్ చిన్న మార్పు తీసుకురావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం గాలక్సీ ఎస్26 ఆల్ట్రాలో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండగా, గాలక్సీ ఎస్27 ఆల్ట్రాలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చని గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. సెల్ఫీలు తీసుకోవడం, వీడియో కాల్స్ చేయడం ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ అప్‌గ్రేడ్ ఉపయోగపడవచ్చు. అయితే మెగాపిక్సెల్స్ పెరిగినంత మాత్రాన ఫొటోల నాణ్యత కూడా అదే స్థాయిలో పెరుగుతుందని చెప్పలేం. కెమెరా సెన్సార్, సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్ వంటి అంశాలు కూడా ఫొటో నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

బరువు పెరుగుతుందా?
డిజైన్ దాదాపు మారినప్పటికీ.. గాలక్సీ ఎస్27 ఆల్ట్రా బరువు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఫోన్ మందం సుమారు 7.9 మిల్లీమీటర్లు ఉండవచ్చని అంచనా. బరువు విషయానికి వస్తే 215 నుంచి 218 గ్రాముల మధ్య ఉండవచ్చని సమాచారం. ప్రస్తుతం గాలక్సీ ఎస్26 ఆల్ట్రా బరువు 214 గ్రాములు. ఫోన్ బరువు పెరగడానికి కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.

బ్యాటరీలో అప్‌గ్రేడ్
గాలక్సీ ఎస్27 ఆల్ట్రా గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం బ్యాటరీ. ఈ ఫోన్‌లో 5,700mAh బ్యాటరీ ఇవ్వవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే.. గాలక్సీ ఎస్26 ఆల్ట్రాలోని 5,000mAh బ్యాటరీతో పోలిస్తే ఇది మంచి అప్‌గ్రేడ్ అనే చెప్పాలి. బ్యాటరీ సామర్థ్యం పెరిగితే ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, కెమెరా వినియోగం ఎక్కువగా చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే.. ఫోన్ బ్యాటరీ ఎంతసేపు వస్తుందనేది ప్రాసెసర్, డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

కంపెనీ తన కొత్త గాలక్సీ ఎస్27 ఆల్ట్రాను మార్కెట్లో ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? ఇలా చెక్ చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement