Amarendu Prakash takes charge as SAIL new chairman - Sakshi
Sakshi News home page

సెయిల్‌ చైర్మన్‌గా ప్రకాష్‌ బాధ్యతలు స్వీకరణ

Published Thu, Jun 1 2023 6:53 AM

Sail new chairman Amarendu prakash - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు సంస్థ సెయిల్‌ కొత్త చైర్మన్‌గా అమరేందు ప్రకాష్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఉన్న సోమ మోండల్‌ ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయడంతో నూతన నియామకం చోటు చేసుకుంది. మే 31 నుంచి సెయిల్‌ చైర్మన్‌గా ప్రకాష్‌ బాధ్యతలు స్వీకరించినట్టు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల‌కు కంపెనీ సమాచారం ఇచ్చింది. బిట్‌ సింద్రి నుంచి మెటలర్జీలో బీటెక్‌ చేసిన ఆయన 1991లో సెయిల్‌లో చేరారు. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement