కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి! | Rupee Jumps 21 Paise To 77.50 Per Dollar | Sakshi
Sakshi News home page

కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి!

Jun 2 2022 8:51 AM | Updated on Jun 2 2022 8:51 AM

Rupee Jumps 21 Paise To 77.50 Per Dollar - Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి 21 పైసలు కోలుకుంది. 77.50 వద్ద ముగిసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో మంగళవారం జీవితకాల కనిష్టం 77.71కి పడిపోయింది.

 బుధవారం 77.58 వద్ద ప్రారంభమైంది. 77.50–77.62 శ్రేణిలో తిరిగింది. కొన్ని బ్యాంకులు డాలర్ల విక్రయం రూపాయికి కొంత మేర కలిసివచ్చింది. అయితే ఇది తాత్కాలిక ధోరణి అని, రూపాయి బలహీనతే కొనసాగుతుందని నిపుణుల అంచనా. 
 

Advertisement
 
Advertisement
Advertisement