స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు! | Royal Enfield increased the prices of its iconic Bullet 350 | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!

Jun 20 2025 4:41 PM | Updated on Jun 20 2025 5:38 PM

Royal Enfield increased the prices of its iconic Bullet 350

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తన ఐకానిక్ బుల్లెట్ 350 సిరీస్‌ ధరల్లో స్వల్ప మార్పులు ప్రకటించింది. వేరియంట్‌ను అనుసరించి ధరను రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచినట్లు తెలిపింది. దాంతో బేస్‌ వేరియండ్‌ ధర రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ప్రీమియం మోడల్‌ ధర రూ.2.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఈ ధరల పెంపుతో పాటు బుల్లెట్ సిరీస్‌లో అప్‌డేటెడ్‌ మోడల్‌ బెటాలియన్ బ్లాక్‌ను ప్రవేశపెట్టింది. బెటాలియన్ బ్లాక్ బేస్ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆకట్టుకునే డిజైన్‌తో బ్లాక్ బాడీ, గోల్డెన్ హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రిప్స్, రెట్రో టెయిల్ లైట్, స్కూప్డ్ సింగిల్ సీట్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: అన్ని టూవీలర్లలో ఏబీఎస్‌ తప్పనిసరి

ఇంతకుముందు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మిలిటరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.76 లక్షలకు చేరింది. రెడ్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. దీనిపై రూ.2000 ధర పెరిగింది. బ్లాక్, మెరూన్ రంగుల్లో లభించే స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది. దీని ధర రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ ఎడిషన్ ఇప్పుడు రూ.2.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) రూ .2,000 పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement