గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో!! ఎందుకంటే..

Ronaldo Invest Huge Sum On Special Oxygen Chamber - Sakshi

అదేంటీ వాతావరణంలోని పుక్కిడికి దొరికే గాలిని పీల్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది కదా! అంతేసి ఖర్చు ఎందుకు? దండగ కాకపోతే.. అనుకుంటున్నారా?. ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంటుంది మరి. ప్యూర్‌ ఎయిర్‌గా పేరున్న ఈ మెషిన్‌ కోసం సాకర్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో భారీగానే ఖర్చుపెట్టాడు. ఇంతకీ దాని ఖర్చెంతో.. ప్రత్యేకతలేంటో తెలుసా?

హైపర్‌బారిక్‌ ఆక్సిజన్‌ థెరపీ (HBOT) మెషిన్‌ ఖరీదు 15,000 పౌండ్లు. మన కరెన్సీలో 15 లక్షల రూపాయలపైనే. ఈ డివైజ్‌ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్‌ ఆక్సిజన్‌ను రక్తంలోకి సరఫరా చేస్తుంది. తద్వారా రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలం క్యూర్‌ అయిపోతుంది. ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే 36 ఏళ్ల రొనాల్డో.. ఈ ఛాంబర్‌ను తన జిమ్‌ రూంలో ఈ మధ్యే ఏర్పాటు చేయించాడు. 

చిన్నచిన్నగాయాలకు సైతం మ్యాచ్‌లకు దూరం అయ్యే రొనాల్డ్‌.. ఇలాంటి హైటెక్‌ చికిత్సల ద్వారా తరచూ ఉపశమనం పొందుతాడట. వాస్తవానికి రొనాల్డో ఇలాంటి ఛాంబర్లను ఉపయోగించడం కొత్తేం కాదు. 2016లో యూరో ఫైనల్‌లో తగిలిన మోకాలి గాయం తర్వాత స్పానిష్‌ ఐల్యాండ్‌ ఇబిజాకు వెళ్లి.. ఇలాంటి ఛాంబర్‌లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాడు.  కానీ, యూకేలో అలాంటి మెషిన్‌లు దొరక్కపోవడంతో కొని.. చెషైర్‌లోని తన ఇంట్లో ఇన్‌స్టాల్‌ చేయించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది 50 వేల పౌండ్లు ఖర్చు పెట్టి ఐస్‌ ఛాంబర్‌ను కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్చెస్ట్‌ సాకర్‌ ప్లేయర్‌గా పేరున్న రొనాల్డోతో మామూలుగా ఉండదు మరి!. 

ఛాంబర్‌ ప్రత్యేకతలు

చిన్న ఛాంబర్‌ లాంటి గది ఉంటుంది. డ్రైవింగ్‌ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం రూపొందించినప్పటికీ.. రకరకాల జబ్బులు ఉన్నవాళ్లు తమకు నయం కావడానికి ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ లిస్ట్‌లో సెలబ్రిటీలు కూడా ఎక్కువ!.  1662లో ఓ ఫిజీషియన్‌ ఈ తరహా ఛాంబర్‌ ఒకటి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కోసం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. 1940లో మిలిటరీ డైవర్స్‌ కోసం అమెరికా దేశం HBOT ఎక్కువ స్థాయిలో తయారు చేయించింది. అనుమతులు పొందాకే వీటిని వాడాల్సి ఉంటుంది. HBOTలతో ఉపయోగాలే కాదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయట. అందుకే వీటిని వినియోగించేముందు కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు మరి!. ఎక్కువ మంది ఒకేసారి ఈ చికిత్స తీసుకునేందుకు ప్రత్యేక గదులను సైతం ఏర్పాటు చేయిస్తుంటారు. ఈ ట్రీట్‌మెంట్‌కు కాస్ట్‌ ఎక్కువగా ఉంటోంది.

చదవండి: రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top