Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం

Portugal Football Star Cristiano Ronaldo Statue Installed In Goa - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అతని ఆటకు, క్రేజ్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉంటుంది. వయసులో చిన్నవాడైనప్పటికి ఫుట్‌బాల్‌లో మాత్రం చాలా ఎదిగిపోయాడు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డో గోల్‌ కొడుతుంటే మనకు ఏదో జరుగుతున్న ఫీలింగ్‌ వస్తుంది. అంతలా ఇన్‌స్పైర్‌ చేస్తాడే కాబట్టే అతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇక అతన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఫుట్‌బాల్‌వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి రొనాల్డోకు మన ఇండియాలోనూ బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే గోవాలోని పనాజీలో 410 కేజీల బరువు ఉన్న రొనాల్డో కాంస్య విగ్రహాన్ని గోవా మంత్రి మైకెల్‌ లోబో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనాజీలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు వెనుక ఒక కారణం ఉందన్నారు.'' ఇండియాలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇక్కడి యువత రొనాల్డోను ఆదర్శంగా తీసుకొని ఫుట్‌బాల్‌లో మరింత ముందుకు పోవాలనేది తమ కోరిక. రోజు ప్రాక్టీస్‌కు వచ్చే యువత ఈ విగ్రహాంతో సెల్ఫీలు మాత్రమే దిగకుండా.. అతన్ని చూసి ఇన్‌స్పైర్‌ పొంది.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కలగా పెట్టుకోవాలి. ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఫుట్‌బాల్‌ మైదానాల్లో ప్రాక్టీస్‌కు వచ్చే యువతకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది'' అని చెప్పుకొచ్చారు. ఇక రొనాల్డో ప్రస్తుతం పోర్చుగల్‌ జట్టుతో పాటు మాంచెస్టర్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top