టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Reliance Tata Deal Ambanis RIL May Buy 30 Percent Tata Play Stock - Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్‌లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్‌కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది.

ఇప్పటికే టాటా ప్లేలో తన వాటాను టాటా గ్రూప్‌కు విక్రయించడానికి టెమాసెక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల సారాంశం ఇంకా బయటపడలేదు. అయితే ఇప్పుడు రిలయన్స్, టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. టాటా గ్రూప్, రిలయన్స్ మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇదే అవుతుంది. ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియోసినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్‌లకు అందించనుంది.

ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి!

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top