రిలయన్స్‌ కిట్టీలో సోస్యో డ్రింక్‌

Reliance Industries To Buy 50 Stake Of Sosyo Hajoori Beverages - Sakshi

కార్బొనేటెడ్‌ పానీయాల కంపెనీ సోస్యో హజూరీ బెవరేజెస్‌లో రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ గుజరాత్‌ కంపెనీలో మిగిలిన 50 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు హజూరీ కుటుంబం కలిగి ఉంటుందని డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ తాజాగా తెలియజేసింది. అయితే డీల్‌ విలువను వెల్లడించలేదు.

తాజా కొనుగోలుతో పానీయాల విభాగం మరింత బలపడనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ ఎఫ్‌ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ పేర్కొంది. శత వసంతాల పురాతన కంపెనీ సోస్యో కార్బొనేటెడ్‌ పానీయాలు, జ్యూస్‌ల తయారీలో ఉంది. కాగా.. ఇప్పటికే రిలయన్స్‌ రిటైల్‌ సుప్రసిద్ధ బ్రాండ్‌ క్యాంపాకోలాను సొంతం చేసుకోవడం తెలిసిందే.

1923లోనే..: సోస్యో హజూరీ బెవరేజెస్‌ను 1923లో అబ్బాస్‌ అబ్దుల్‌రహీమ్‌ హజూరీ ఏర్పాటు చేశారు. గుజరాత్‌లో తయారీ యూనిట్‌ ఉంది. ప్రధాన బ్రాండ్‌ సోస్యో పేరుతో గుజరాత్‌తోపాటు పొరుగు రాష్ట్రాలలోనూ పానీయాలు విక్రయిస్తోంది. పానీయాలను యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా స్థానిక హెరిటేజ్‌ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడంతోపాటు.. వృద్ధి అవకాశాలకు తెరతీయనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ పేర్కొన్నారు.

చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్‌.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top