గేమింగ్ ప్రియుల కోసం రెడ్‌మీ సూపర్ ఫోన్!

Redmi K40 Gaming Edition With MediaTek Dimensity 1200 SoC - Sakshi

చైనా: గేమింగ్ కిల్లర్ రెడ్ మీ కే40 సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్ ను చైనాలో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్లను షియోమీ తీసుకొచ్చింది. షోల్డర్ బటన్లు, మూడు మైక్‌లు, డాల్బీ అట్మాస్, జేబీఎల్ ఆడియో సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ మొబైల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 30వ తేదీన చైనాలో జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయం తెలియదు.

రెడ్‌మీ కే40 గేమింగ్ ఎడిషన్ ఫీచర్స్

 •  6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే
 • 120 హెర్ట్జ్‌ స్క్రీన్ రిఫ్రెట్ రేట్
 • హెచ్‌డీఆర్10+ సపోర్ట్ 
 • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ 
 • 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్
 • 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా + 2 ఎంపీ కెమెరా 
 • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా
 • 5065 ఎంఏహెచ్ బ్యాటరీ
 • 67వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ 
 • 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు 
 • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 1,999 యువాన్లు (సుమారు రూ.23,000) 
 • 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,199 యువాన్లు (సుమారు రూ.25,300) 
 • 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,600) 
 • 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,500)
 • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,699 యువాన్లు (సుమారు రూ.31,100)

చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top