65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు!

Uton Energia comes up with low cost EV for short travel - Sakshi

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు అమ్మకాల విషయంలో తక్కువ వృద్ది రేటు నమోదు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక వ్యయం, బ్యాటరీ సమస్యలు అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే తక్కువ ఖర్చుతో ప్రయాణించే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ కు చెందిన ఉటన్ ఎనర్జియా అనే స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది. పొర్టీ ఫైవ్ అనే పేరుతో ఈ బైక్ ను మార్కెట్ లోకి విడుద‌ల చేసింది. 

దీనిని కేవలం ఒక గంటన్నర పాటు చార్జ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్ కి సంబందించి ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొద‌లైయ్యాయి. ఈ బైక్ ఒక్క‌సారి చార్జీ చేస్తే దాదాపు 65 నుంచి 70 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌దు, అలాగే దీనిని చార్జ్ చేయడానికి రెండు యూనిట్లు పవర్ ఖర్చు అవుతుందని కంపెనీ ప్రతినిదులు పేర్కొన్నారు. అంటే కేవ‌లం 5 రూపాయిలలోపే అన్న మాట. ఈ బైక్‌ను కె. శ్రీ హర్ష వర్ధన్ అభివృద్ధి చేశారు. అతను చిన్నప్పటి నుంచి రేసు కారు, ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడంలో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండేవాడు.

ఒక కంపెనీలో 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, తక్కువ దూరానికి తక్కువ ఖర్చుతో ప్రయాణించే ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2019 జనవరిలో కంపెనీని ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 2021లో పొర్టీ ఫైవ్ అనే బైక్ రూపొందించాడు. ఐదు రూపాయిల‌తో దాదాపు 65 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌డానికి వీల‌వుతుంద‌ని. ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏ బైక్ కూడా ఇంత సౌక‌ర్య‌వంతంగా ఇంత త‌క్కువ ధ‌ర‌లో లేద‌ని ఉటన్ ఎనర్జిజా సంస్థలోని ఈ బైక్ ను తయారు చేసిన హర్షవర్దన్ తెలిపారు.

పూర్తీ స్థాయి బ్యాటరీ బేక‌ఫ్ తో వ‌చ్చే ఈ బైక్ ప్ర‌స్తుతం 35 వేల రూపాయిల‌కు మార్కెట్ లో అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన వెబ్ సైట్ లో 9,999 రూపాయలు చెల్లించి బుక్ చేసుకునే అవకాశం ఉంది. ప్ర‌స్తుతానికి రెండు క‌ల‌ర్స్ మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని భ‌విష్య‌త్ లో మ‌రిన్నిక‌ల‌ర్స్ అందుబాటులో ఉంటాయిని అంటున్నారు. ఈ బైక్ లో 675 వాల్ట్ బ్యాట‌రీని పొందుప‌ర్చారు. బైక‌ర్ చార్జ్ చేయాడానికి ప్రత్యేక‌మైక ఫ్లగ్ లాంటిది అవ‌సరం లేకుండానే మ‌నం నిత్యం ఫోన్ చార్జింగ్ చేసుకునే సాకెట్ నుంచే చార్జ్ చేసుకునే సౌలభ్యం క‌ల్పించారు. ఈ సంస్థ నాచారంలో ఉన్న ఉత్పత్తి యూనిట్‌ ద్వారా నెలకు 200 వాహనాలను తయారు చేయగలదు.

చదవండి:

కార్ల తయారీ ప్లాంట్ మూసేసిన మారుతి సుజుకి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top