మార్కెట్ సమయాలపై ఆర్‌బీఐ సూచనలు | RBI Panel Recommends Trading Hours for Forex Markets | Sakshi
Sakshi News home page

మార్కెట్ సమయాలపై ఆర్‌బీఐ సూచనలు

May 5 2025 8:28 PM | Updated on May 5 2025 8:34 PM

RBI Panel Recommends Trading Hours for Forex Markets

ముంబై: ఫారెక్స్ ఎక్స్‌ఛేంజ్‌ మార్కెట్లకు ప్రస్తుత ట్రేడింగ్‌ వేళలనే కొనసాగించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ కమిటీ సిఫార్సు చేసింది. కాల్‌ మనీ మార్కెట్‌ టైమింగ్స్‌ను మాత్రం రాత్రి 7 గం.ల వరకు పొడిగించాలని సూచించింది.

ప్రస్తుతం  కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్‌ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 3.30 గం.ల వరకు ఉంటున్నాయి. అయితే, ఆన్‌షోర్‌ మార్కెట్‌ వేళల తర్వాత నాన్‌ రెసిడెంట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు సాయంత్రం 5 గం.ల నుంచి రాత్రి 11.30 గం.ల వరకు ట్రేడింగ్‌ వేళలు ఉంటున్నాయి.

మరోవైపు, కాల్‌ మనీ మార్కెట్‌ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు, రెపో మార్కెట్‌ టైమింగ్స్‌ ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 2.30 గం.ల వరకు ఉంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement