ఆర్‌బీఐ కీలక ప్రకటన.. ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు RBI Cancels Licence of Maharashtra City Cooperative Bank. Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కీలక ప్రకటన.. ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Published Thu, Jun 20 2024 9:39 PM | Last Updated on Fri, Jun 21 2024 8:59 AM

RBI Cancels Licence of Maharastra City Co operative Bank

మహారాష్ట్రలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ తగిన మూలధనం మరియు సంపాదన అవకాశాలు లేని కారణంగా రిజర్వ్ బ్యాంక్ బుధవారం లైసెన్స్‌ను రద్దు చేసింది. మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌ను కూడా బ్యాంకును మూసివేయడానికి & లిక్విడేటర్‌ను నియమించడానికి ఆర్డర్ జారీ చేయాలని కోరినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ ప్రకారం.. సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపైన ఎలాంటి బ్యాంకింగ్ సేవలను అందించిందని తెలుస్తోంది. ఆర్‌బీఐ ఆదేశాలు 2024 జూన్ 19 నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో ఆ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన వారు కొంత ఆందోళన చెందుతున్నారు.

బ్యాంకులో డబ్బు దాచుకున్న ఖాతాదారులు నష్టపోకుండా ఉండటానికి డిపాజిటరీ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇది బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.

బ్యాంకు దివాళా తీసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డిపాజిటర్లు నష్టపోకుండా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. కాబట్టి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం, డిపాజిటర్లలో 87 శాతం మంది డీఐసీజీసీ నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్‌బీఐ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement