రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..! | Sakshi
Sakshi News home page

రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!

Published Mon, May 20 2024 7:36 PM

Ratan Tata casts vote in Mumbai

ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

అణువణువూ ఆదర్శమే..
వాస్తవానికి ఎలక్షన్‌ కమిషన్‌ ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కానీ 86 ఏళ్ల రతన్‌ టాటా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రతన్‌టాటా అక్కడి పోలింగ్ సిబ్బందితో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.

అందరూ ఓటేయాలని పిలుపు
ముంబైలో ఓటు వేయడానికి రెండు రోజుల ముందే రతన్ టాటా  నగరంలోని ఓటర్లందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “ముంబయిలో సోమవారం ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటలకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను” అని ఆయన శనివారం ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement