ప్యారిస్‌ ఎయిర్‌షోలో రఘు వంశీ టర్బోజెట్‌ ఇంజిన్‌  | Raghu Vamsi unveils indigenous 40 KGF micro turbojet engine at Paris | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ఎయిర్‌షోలో రఘు వంశీ టర్బోజెట్‌ ఇంజిన్‌ 

Jun 19 2025 6:15 AM | Updated on Jun 19 2025 7:57 AM

Raghu Vamsi unveils indigenous 40 KGF micro turbojet engine at Paris

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యారిస్‌లో జరుగుతున్న 55వ అంతర్జాతీయ ఎయిర్‌షోలో హైదరాబాద్‌ సంస్థ రఘు వంశీ ఏరోస్పేస్‌ గ్రూప్‌ తమ 40 కేజీఎఫ్‌ మైక్రో టర్బోజెట్‌ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించినట్లు సంస్థ ఎండీ వంశీ వికాస్‌ తెలిపారు. 

అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌ (యూఏవీ), క్రూయిజ్‌ మిసైల్స్‌ కోసం తయారు చేసిన ఈ ఇంజిన్‌ను డీఆర్‌డీవో అధికారుల సమక్షంలో విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్‌ పార్క్‌లో ఏర్పాటు చేస్తున్న 2,50,000 చ.అ. తయారీ ప్లాంటు 2026 ప్రారంభం నాటికి అందుబాటులోకి రావచ్చన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement