రూ.35,000 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు!

Public sector banks have transferred unclaimed deposits of Rs35,012 crore  - Sakshi

బ్యాంకింగ్‌ నుంచి ఆర్‌బీఐకి బదిలీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్‌బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్‌ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌ పార్లమెంటుకు తెలియజేశారు. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవని ఆయన వెల్లడించారు.

బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్‌ (రూ.4,558 కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top