ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్‌.. ఎవరీ పూనమ్‌ గుప్తా? | Poonam Gupta Appointed As RBI Deputy Governor, Who Is Poonam Gupta And Know About Her Qualification Details | Sakshi
Sakshi News home page

Poonam Gupta: ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్‌.. ఎవరీ పూనమ్‌ గుప్తా?

Apr 2 2025 9:22 PM | Updated on Apr 3 2025 1:45 PM

Poonam Gupta appointment as RBI Deputy Governor

ఢిల్లీ : కేంద్రం మరో మహిళా అధికారిణికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారిణి నిధి తివారీని ప్రధాని మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా నియమించింది. తాజాగా, పూనమ్ గుప్తా అనే అధికారిణిని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తాను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైరైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకల్ పత్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.  

పూనమ్ గుప్తా ఎవరు?
కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ పూనమ్ గుప్తా నియామకాన్ని ఆమోదించింది. ఆమె ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బాధత్యలు స్వీకరించే ముందు ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు. భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌ బోధించడంతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.

ఇక ఆమె చదువు విషయానికి వస్తే  
ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ :  యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1998)
స్పెషలైజేషన్: మాక్రో ఎకానమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ,ఇంటర్నేషనల్ ట్రేడ్
ఎం.ఎ ఎకానమిక్స్ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1995)
ఎం.ఎ ఎకానమిక్స్‌ : ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ (1991)
బీఏ ఎకానమిక్స్‌ : హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ (1989)
ఆమె 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి EXIM బ్యాంక్ అవార్‌ను గెలిచారు

Advertisement
 
Advertisement
Advertisement