పీఎల్‌ఐ స్కీములతో పెట్టుబడులకు దన్ను.. | PLI Scheme key driver of investment across multiple sectors | Sakshi
Sakshi News home page

పీఎల్‌ఐ స్కీములతో పెట్టుబడులకు దన్ను..

Jun 13 2025 11:05 AM | Updated on Jun 13 2025 11:05 AM

PLI Scheme key driver of investment across multiple sectors

ఎలక్ట్రిక్, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాలతో పని చేసే హెవీ ఎర్త్‌ మూవింగ్‌ మెషినరీ (హెచ్‌ఈఎంఎం) తయారీ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రవేశపెడితే మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి వాహనాలకు డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఈ విభాగంపై తయారీ సంస్థలు, సరఫరాదారులు పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్‌ చేయకపోవచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ మోసాలకు ఎయిర్‌టెల్‌ చెక్‌

‘పీఎల్‌ఐ స్కీమును ప్రకటిస్తే కొత్త పెట్టుబడులు వస్తాయి. తయారీ, ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌డీ విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే హెచ్‌ఈఎంఎంలను దేశీయంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి‘ అని భారతీయ ఖనిజ పరిశ్రమ సమాఖ్య (ఎఫ్‌ఐఎంఐ) రూపొందించిన నివేదిక తెలిపింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌తో కలిసి ఎఫ్‌ఐఎంఐ దీన్ని రూపొందించింది. మైనింగ్‌ కార్యకలాపాల్లో కీలకమైన హెచ్‌ఈఎంఎంలు.. కర్బన ఉద్గారాలకు కారకంగా ఉంటున్నందున పర్యావరణహితమైన మెషినరీపై ఆసక్తి ఏర్పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement