రైల్వే ప్రయాణికులకు శుభవార్త, పేటీఎంలో ఐఆర్‌సీటీసీ సేవలు!

Paytm Allows Users To Irctc Booking Related Services - Sakshi

దేశీయ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎం రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పేటీఎం ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌, బుకింగ్‌ మూవీ టికెట్స్‌, పలు రకాలైన సేవల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్‌ను పేటీఎం తన యాప్‌లో జత చేసింది. 

ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో ప్రయాణికులకు ఇకపై సులభం తత్కాల్‌ ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌, క్యాన్సిలేషన్‌పై టికెట్లపై ఇన్‌స్టంట్‌ రీఫండ్‌, ఫ్లాట్‌ ఫామ్‌ నెంబర్‌ను ట్రాక్‌ చేయడంతో పాటు ఐటీఆర్‌సీటీసీ బుకింగ్స్‌ సంబంధించిన అన్నీరకాల సర్వీసుల్ని యూజర్లు వినియోగించుకోవచ్చని పేటీఎం ప్రతినిధులు తెలిపారు.  

వీటితో పాటు మీరు బుక్‌ చేసుకున్న ట్రైన్‌ టికెట్‌ కన్ఫామ్‌ లేదా అని తెలిపేలా ప్రిడిక్షన్స్‌ సైతం చూపిస్తుంది. అదే సమయంలో మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతానికి అదే సమయానికి ఏయే ట్రైన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉంటే సదరు ట్రైన్‌లలో సీట్లను కేటాయిస్తామని పేటీఎం హామీ ఇచ్చింది.  

ఐఆర్‌సీటీసీ ప్రయాణికులు సైతం పేటీఎం యాప్‌లో సమీప రైల్వే స్టేషన్‌లను, ట్రైన్‌ టికెట్‌లపై పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. ట్రైన్‌ సమయపాలనలో అంతరాయం ఉంటే ముందే చెప్పేస్తుంది. 24*7 పేటీఎం యాప్‌లో 10 లాంగ్వేజ్‌లలో సీనియర్‌ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు అనుగుణంగా వారికి కావాల్సిన విధంగా టికెట్‌ ధరల్ని అందిస్తుంది.  

పేటీఎంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

👉యాప్ లో పేటీఎంలోకి లాగిన్ అవ్వండి లేదా paytm.com/train-tickets సందర్శించండి

👉మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి

👉ఆ తర్వాత జర్నీ డేట్‌ ఎంటర్‌ చేసి ఏయే ట్రైన్‌లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు సెర్చ్‌ ఆప్షన్‌పై ట్యాప్‌  చేయండి. 

👉ఇప్పుడు మీ ట్రైన్‌,  అందులో సీటు సదుపాయం ఉందో లేదో చెక్‌ చేసుకొని మీకు కావాల్సిన సీటు, తరగతి, తేదీని ఎంపిక చేసుకోవాలి. 

👉టికెట్లు బుక్ చేసుకోవడానికి బుక్  బటన్ మీద క్లిక్ చేసి, మీ ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడిని ఎంటర్‌ చేయండి.

👉మీకు లాగిన్ ఐడీ లేకపోతే ‘సైన్ అప్ విత్ ఐఆర్‌సీటీసీ’ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయడం లేదా, ఐఆర్‌సీటీసీ ఫర్‌ గెట్‌ పాస్‌వర్డ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ఐఆర్‌సీటీసీ ఐడీని రీసెట్‌ చేసుకోవచ్చు. 

👉తరువాత, ట్రైన్‌ వివరాల్ని జత చేసి ‘బుక్’ ఆప్షన్‌మీద ట్యాప్‌ చేయండి.  

👉ఇప్పుడు మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా బుక్‌ చేసుకున్న టికెట్లకు డబ్బులు చెల్లించండి.  

👉మీ బుకింగ్ పూర్తి చేయడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది.  

👉ధృవీకరించడానికి పాస్ వర్డ్ ను ఎంటర్‌ చేయండి

👉టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేటీఎం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి మీ టికెట్ల ఇమెయిల్ కూడా పంపుతుంది.

చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్‌ లిస్టులో ఉందా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top