Vineeta Agrawal: ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు..సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య అదిరిపోయే ట్విస్ట్!

Parag Agrawal wife Vineeta linked with Elon Musk Twitter takeover - Sakshi

అమెరికన్‌ బిజినెస్‌ టైకూన్‌ ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు అంశంలో ప్రతి సీను ఓ సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా ట్విటర్‌లో అధిక స్టేక్‌ను కొనుగోలు చేయడం దగ్గర నుంచి..ఆ సంస్థ ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను తొలగింపు వరకు ఇలా ప్రతి సందర్భం వ్యాపార దిగ్గజాల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. అయితే తాజాగా ట్విటర్‌లో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. 

దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను ఎలన్‌ మస్క్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ట్విటర్‌ కొనుగోలులో..ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య వినీతా అగర్వాల్‌ కీ రోల్‌ ప్లే చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదెలా అంటారా?

అమెరికాలోని కాలిఫోర్నియా మెన్‌లో పార్క్‌ కేంద్రంగా ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌ అనే సంస్థ వెంచర్‌ క్యాప్టలిస్ట్‌ (వీసీ)గా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే మెటాకు భారీ ఎత్తున ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అదే సంస్థ ..ట్విటర్‌ను టేకోవ‌ర్ చేయ‌డానికి ఎల‌న్‌మ‌స్క్‌కు 400 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టేందుకు అంగీక‌రించింది. అయితే ట్విటర్‌లో పెట్టుబడుల అంశంపై వినీతా అగర్వాల్‌ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.  

ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌కు వినీతా అగర్వాల్‌ జనరల్‌ పార్ట్‌నర్‌గా ఉన్నారు. దీంతో పాటు డ్రగ్స్‌ డెవలప్‌మెంట్‌, లైఫ్‌ సైసెన్స్‌ టూల్స్‌, డయోగ్నోస్టిక్స్‌, డిజిటల్‌ హెల్త్‌, రోగి సంరక్షణ కోసం ప్రత్యేక డేటాసెట్ లు వంటి హెల్త్‌ కేర్‌ విభాగంగా పెట్టుబడులు పెట్టే అంశంలో ముఖ్యపాత్రపోషిస్తున్నారు.

ఇప్పుడు ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయడంలో ఆర్ధికంగా ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌కు సాయం చేస్తుండడం, ఆ సంస్థకు జనరల్‌ పార్ట్‌నర్‌గా వినీతా అగర్వాల్‌ ఉండడం' ప్రస్తుతం ఈ అంశం హాట్‌ టాపిగ్గా మారింది. ట్విటర్‌ కొనుగోలులో ఎలన్‌మస్క్‌కు ఆర్ధికంగా సాయం చేయడంతో వినీతా అగర్వాల్‌ వార్తల్లో నిలుస్తున్నారు.

చదవండి👉మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు: రాజుగారి ట్యూన్‌ ఇలా మారిందేంట‌బ్బా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top