స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌! | Oneplus 10r Gets More Affordable In India | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌!.. భారీగా తగ్గిన వన్‌ప్లస్‌ 10ఆర్‌ ధరలు

Apr 1 2023 9:52 PM | Updated on Apr 1 2023 9:52 PM

Oneplus 10r Gets More Affordable In India - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన వన్‌ప్లస్‌ 10ఆర్‌ ధరల్ని భారీగా తగ్గించింది. గత ఏడాది విడుదలైన  వన్ప్లస్ 10 ఆర్ ప్రారంభ ధర రూ. 38,999 గా ఉంది. అయితే తాజాగా ఆఫోన్‌ ధరల్ని భారీ తగ్గించడంతో.. కొనుగోలు దారులు రూ. 31,999కే సొంతం చేసుకోవచ్చని వన్‌ ప్లస్‌ ప్రతినిధులు తెలిపారు. 

వన్ప్లస్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 150డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్, 80డబ్ల్యూ ఛార్జర్‌ సప్టోర్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీకి సపోర్ట్‌ చేస్తుంది. 

వీటితో పాటు 50 ఎంపీ రిసొల్యూషన్‌తో సోనీ ఐఎంఎక్స్‌ 766 సెన్సార్లు, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్‌ లెన్స్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్లు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియా టెక్‌ డైమెన్సిటీ 8100 మ్యాక్స్‌ చిప్‌ సెట్‌, 12జీబీ నుంచి 256 జీబీ వరకు ఇంట్రర్నల్‌ స్టోరేజ్‌, ఆక్సీజెన్‌ ఓఎస్‌ 12.1 బేస్డ్‌ ఆండ్రాయిడ్‌ 12 వంటి ఫీచర్లు ఉన్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement