
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్నట్లు 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రకటించారు. ‘‘డిజిన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన వివిధ అంశాల పరిశీలన, ఇందులో బ్యాంకు(ల) ఎంపిక అంశాలను క్యాబినెట్ కమిటీ పరిశీలిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఈ విషయంలో (ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తాజాగా లోక్‌సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ ద్వారా రూ.175 లక్షల కోట్ల సమీకరించాలని కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.