stockmarket: జోడు గుర్రాల్లా సూచీలు

 Nifty hits fresh peak, Sensex up 250points - Sakshi

దిగొస్తున్న కేసులు, లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు

మంచి వర్షపాతం

నిఫ్టీ సరికొత్త గరిష్టానికి, రికార్డు ముగింపు

250 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి  దేశంలో కరోనా  కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలంగా ఉంది. ఫలితంగా ఫ్లాట్‌గా ఉన్న కీలక సూచీలు ప్రస్తుతం లాభాలతో  కళకళలాడాయి.. రికార్డు స్థాయిలను అధిగమించిన సూచీలు జోడు  గుర్రాల్లా దూసుకుపోయాయి. . సెన్సెక్స్‌  228 పాయింట్లు పెరిగి 52,328 వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 15,751 రికార్డు స్థాయికి చేరుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల సందడి కనిపించింది.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవనున్నాయన్న వాతావారణశాఖ అంచనాలకు తోడు సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గుతుండటం, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు వార్తలు రావడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను  ప్రభావితం చేస్తోంది.. బ్యాంకింగ్‌ ,ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో  షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, అదాని పోర్ట్స్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ లాభాల్లోనూ,  మరోవైపు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా టాప్‌ లూజర్స్‌గానూ నిలిచాయి.

చదవండి :  vaccine: చిన్నారులపై ఎయిమ్స్‌ ట్రయల్స్‌
Petrol, diesel price today: పెట్రో ధరల రికార్డు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top