ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు .. కొత్త తరం చూపు

Next-gen customers massively adopting online shopping says Amazon India official - Sakshi

అమెజాన్‌ ఇండియా వీపీ సౌరభ్‌ శ్రీవాస్తవ

కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్‌ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఫ్యాషన్‌ ఇండియా వీపీ సౌరభ్‌ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్‌ 8 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ (ఏజీఐఎఫ్‌) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్‌ కనిపిస్తుండగా మొబైల్‌ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్‌లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top