ఇండియన్‌ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్‌ నీలేకని | next 10 years India to see significant economic activity says Nandan Nilekani | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్‌ నీలేకని

Published Wed, Nov 30 2022 2:17 PM | Last Updated on Wed, Nov 30 2022 2:25 PM

next 10 years India to see significant economic activity says Nandan Nilekani - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ రానున్న పది సంవత్సరాల్లో ‘‘కీలకమైన ఆర్థిక క్రియాశీలత’’ను ప్రదర్శించనుందని ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకులు, చైర్మన్‌ నందన్‌ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యయుతమైన రీతిలో విస్తృత ప్రాతిపదికన, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ క్రియాశీలత ఉంటుందని కూడా ఆయన విశ్లేషించారు.  

డిజిటల్‌ కామర్స్‌ కోసం ఓపెన్‌ నెట్‌వర్క్‌ (ఓఎన్‌డీసీ), రికార్డ్‌ అగ్రిగేటింగ్‌ సిస్టమ్, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), ఫాస్ట్‌ట్యాగ్, ఈ-వే బిల్లుల వంటి ప్రభుత్వ చర్యలు భారత్‌ ఆర్థిక వృద్ధి బాటన దోహదపడే అంశాలుగా వివరించారు. కార్నెగీ ఇండియా నిర్వహించిన బల్‌ టెక్నాలజీ సమ్మిట్‌ 7వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో 60 కోట్ల మందికి ఆధార్‌ గుర్తింపు ఉంటే, ప్రస్తుతం 130 కోట్ల మంది భారతీయులకు ఈ ఐడీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉపయోగించగల ఆన్‌లైన్‌ ఐడీ అని పేర్కొంటూ, బయోమెట్రిక్స్, ఓటీపీల ద్వారా ఒక వ్యక్తి ప్రమాణీకరణకు ఇది దోహదపడుతుందని అన్నారు.  (టీవీఎస్‌ అపాచీ స్పెషల్‌ ఎడిషన్‌, న్యూ లుక్‌ చూస్తే ఫిదానే!)

ఇవీ చదవండి:  అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!

ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్‌ రియాక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement