విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే! | Sakshi
Sakshi News home page

విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు - కేటీఎమ్ నుంచి సుజుకీ వీ స్ట్రోమ్ వరకు..

Published Fri, Sep 1 2023 1:41 PM

New bikes launching in 2023 september - Sakshi

Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. 
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం.

2024 కేటీఎమ్ 390 డ్యూక్..
యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము.

సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ..
సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి.

Advertisement
 
Advertisement