నెట్‌వర్క్‌18 మీడియా క్యూ3 వీక్‌.. 97 శాతం పతనం! | Network18 Q3 Results: Firm Profit Down 97 Pc To Rs Almost 9 Crore, Ad Slowdown | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్‌18 మీడియా క్యూ3 వీక్‌.. 97 శాతం పతనం!

Jan 18 2023 6:57 AM | Updated on Jan 18 2023 6:57 AM

Network18 Q3 Results: Firm Profit Down 97 Pc To Rs Almost 9 Crore, Ad Slowdown - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ సంస్థ నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది.

అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్‌వర్క్‌18 మీడియా షేరు బీఎస్‌ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది.

చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు.. 

Advertisement
 
Advertisement
Advertisement