నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ ఏదో బాగుందే..!

Netflix Users On Android Can Now Stream Partially Downloaded Content - Sakshi

శాన్‌ఫ్రాన్సికో: ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు శుభవార్తను తెలిపింది. యూజర్ల కోసం కొత్తగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు పూర్తిగా డౌన్‌లోడ్‌ కాకముందే పాక్షికంగా వీడియోలను చూసే ఫీచర్‌ను కొత్తగా నెట్‌ఫ్లిక్స్ సోమవారం రోజున లాంచ్‌ చేసింది. దీంతో యూజర్లకు చూడాలనుకున్న వీడియోలను కాస్త ముందుగా చూసే అవకాశం కల్గుతుంది. అంతేకాకుండా పాక్షికంగా వీడియోలను చూడటంతో ఫలానా వీడియో నచ్చకపోతే ముందుగానే డౌన్‌లోడ్‌ అవ్వకుండా చేసుకొనే వీలు ఏర్పడుతుంది. దాంతో పాటుగా  యూజర్లకు ఇంటర్నెట్‌ డాటా మిగులుతుంది.

ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ ది వర్జ్‌ ప్రకారం..  యాప్‌ వర్షన్‌ 7.64 పైబడి ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐవోస్‌ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను త్వరలోనే తీసుకువస్తామని నెట్‌ఫ్లిక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కీలా రాబిన్‌సన్‌ పేర్కొన్నారు. అంతకుముందు నెట్‌ఫ్లిక్స్‌లో ఆఫ్‌లైన్‌లో  ఒక సినిమాను లేదా, సిరీస్‌ను చూడాలంటే ముందుగానే పూర్తిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వైఫై కనెక్షన్‌ లేదా డేటాతో వీడియోల డౌన్‌లోడ్‌ మధ్యలో ఆగితే చూడటానికి వీలు లేదు.

చదవండి: కండీష‌న్స్ అప్లై, నెట్ ఫ్లిక్స్ లో సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top