కండీష‌న్స్ అప్లై, నెట్ ఫ్లిక్స్ లో సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు

How to download shows, movies from Netflix details here  - Sakshi

నెట్ ఫ్లిక్స్ లో అల‌రిస్తున్న  సినిమాలు 

ఆఫ్ లైన్ లో సినిమాల్ని డౌన్ లోడ్ చేసే స‌దుపాయం

మ‌నం ఇప్పుడంటే ఇంటికి ప‌రిమితం అయ్యాం' కానీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే బిజి అయిపోతాం. ఉరుకులు ప‌రుగుల జీవితం.ఆఫీస్, ఇల్లు, ప్ర‌యాణ‌ల‌తో  అల‌సిపోతాం. అయితే అలా అల‌సిపోయే మ‌న‌సుకు స్వాంత‌న చేకూర్చేది సంగీతమో లేదంటే సినిమాలు. కాస్త టైం దొరికినా, బ‌స్సులో ప్ర‌యాణిస్తున్నా న‌చ్చిన మ్యూజిక్ వింటూనే, సినిమాలు చూస్తూనో ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డుతుంటాం. ముఖ్యంగా ప్ర‌యాణాల్లో మ్యూజిక్ వినాల‌న్నా, సినిమాలు చూడాల‌న్నా నెట్ బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే వైఫై సౌక‌ర్యం ఉండాలి. కానీ కొన్ని సార్లు ఆ సౌలభ్యం ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఓటీటీలో న‌చ్చిన సినిమా చూసే స‌మ‌యంలో స‌డెన్ వైఫ్ ఇష్యూ వ‌స్తే ఆఫ్ చేసి ఇదేదో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉందే అని తిట్టుకుంటుంటాం. కానీ ఇక‌పై ఈ ఆప్ష‌న్ తో  నెట్ ఫ్లిక్స్ లో మీరు న‌చ్చిన సినిమాను చూడొచ్చు. ఫ్రీగా ఉన్న‌ప్పుడు అదే సినిమాను డౌన్ లోడ్ చేసి చూసుకోవ‌చ్చు. కాక‌పోతే ఆ సినిమాల్లో కొన్ని మాత్ర‌మే డౌన్ లోడ్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించింది నెట్‌ఫ్లిక్స్.  

నెట్‌ఫ్లిక్స్ లో షోలు / సినిమాల్ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? 

• ముందుగా నెట్‌ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేయండి 

• వెస్ సిరీస్ , సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే  డీటెయిల్స్ పేజీలోకి వెళ్లాలి. 
 
• డౌన్‌లోడ్ బటన్ ను క్లిక్ చేస్తే మీకు న‌చ్చిన సినిమా డౌన్ లోడ్ అవుతుంది.  

• నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలను ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ వెబ్ సిరీస్ మొత్తం ఏపీసోడ్ ల‌ను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. ఏపీసోడ్ వైజ్ గా డౌన్ లోడ్ చేసుకోవాలి. పైన మ‌నం చెప్పుకున్న‌ట్లుగా కొన్ని సినిమాలకి మాత్ర‌మే డౌన్ లోడ్ ఆప్ష‌న్ ఉంది. డౌన్ లోడ్ కాని సినిమాల్ని ఆన్ లైన్ లో చూడాల్సి వ‌స్తుంది.  

చ‌దవండి : ఈ టెక్నిక్ తో మీకు న‌చ్చిన సినిమాల్ని ఒక్క క్లిక్ తో చూడొచ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top