యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ షాక్‌!

Netflix Ban If You This Things - Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్‌ ఇచ్చింది.తమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే యూజర్ల అకౌంట్‌లను బ్యాన్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్‌ జీరో టోలరెన్స్‌ పేరుతో రూల్స్‌ బ్రేక్‌ చేసిన యూజర్ల అకౌంట్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే వినియోగదారులు వారి అకౌంట్‌లను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్‌ చేస్తే అదనపు ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకటనతో సుమారు 2లక్షల మంది సబ్‌ స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినా సరే మరోమారు యూజర్లకు కొత్త నిబంధనల్ని విధించింది. ఆ నిబంధనల్ని లైట్‌ తీసుకుంటే మాత్రం యూజర్లపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. 

వీపీఎన్‌ వాడుతున్నారా!
వీపీఎన్‌..వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌. బ్రౌజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. అసాంఘీక కార్యకలాపాలకు, లేదంటే మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్‌ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్‌ సేవల్ని అందిస్తుంది. అయితే ఈ వీపీఎన్‌ సాయంతో నెట్‌ ఫ్లిక్స్‌ను వీక్షిస్తే సదరు యూజర్ల అకౌంట్‌లను బ్లాక్‌ చేయనుంది.

ఒరిజినల్‌ కంటెంట్‌ను కాపీ చేస్తున్నారా!
సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ వీడియో కంటెంట్‌ కాపీ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ టెక్నాలజీ ఉపయోగించి అదే కంటెంట్‌ను మార్చి వీడియోలు చేసినా, లేదేంటే వేరే వారికి అమ్మిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం యూజర్లకు మీరు మా నిబంధనల్ని అతిక్రమించారా అంటూ యాప్‌ ఓపెన్‌ చేస్తే డిస్‌ప్లే అయ్యే పాప్‌ అప్‌లో మిమ్మల్ని అడుగుతుంది. అందులో మీరు పొరపాటునా అతిక్రమించాం అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. అకౌంట్‌ సస్పెండ్‌ అవుతుంది. మళ్లీ అదే అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలంటే సాధ్యపడదు.

చదవండి👉 తగ్గేదేలే: నెట్‌ ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top