ప్రభుత్వానికి కాసుల గలగల.. భారీగా పన్ను వసూళ్లు | Net direct tax collection grows 16 pc annually to rs 9 95 trillion | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి కాసుల గలగల.. భారీగా పన్ను వసూళ్లు

Sep 19 2024 8:36 AM | Updated on Sep 19 2024 10:02 AM

Net direct tax collection grows 16 pc annually to rs 9 95 trillion

న్యూఢిల్లీ: అధిక ముందస్తు పన్ను చెల్లింపుల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ 17వ తేదీ వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.12 శాతం పెరిగి రూ.9,95,766 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్‌ విలువ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 56.49% ఎగసి రూ.2.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి స్థూలంగా వసూళ్లు రూ. 12.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయని గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇవి 21.48%  అధికం. 

విభాగాల వారీగా చూస్తే.. 
» నికర వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 19 శాతం పెరిగి రూ. 5.15 లక్షల కోట్లకు చేరాయి.  
» కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 10.55 శాతం పెరిగి రూ. 4.52 లక్షల కోట్లకు చేరాయి. 
» సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) ఆదాయం రూ.26,154 కోట్లు.  
» ఒక్క అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చూస్తే 22.61 శాతం పెరిగి రూ.4.36 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తిగత పన్నుల విషయంలో ఈ మొత్తాలు 39.22 శాతం పెరిగితే, కార్పొరేట్‌ పన్నుల విషయంలో ఈ పెరుగుదల 18.17 శాతంగా ఉంది.  
» ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 13 శాతం పెరిగి రూ.22.12 లక్షల కోట్లకు చేరాలన్నది బడ్జెట్‌ లక్ష్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement