NCLT Refuses to Restrain Go First From Flying Planes - Sakshi
Sakshi News home page

గో ఫస్ట్‌కు ఎన్‌సీఎల్‌టీలో ఊరట

Jul 27 2023 6:15 AM | Updated on Jul 27 2023 6:55 PM

NCLT refuses to restrain Go First from flying planes - Sakshi

న్యూఢిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఊరట లభించింది. కంపెనీకి లీజుకు ఇచి్చన విమానాలను స్వా«దీనం చేసుకునేందుకు లెస్సర్లు దాఖలు చేసిన పిటీషన్లను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచి్చంది. ఏవియేషన్‌ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ.. ఇంకా వాటిని డీరిజిస్టర్‌ చేయనందున కార్యకలాపాల పునరుద్ధరణకు అవి అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది.

విమానాలు, ఇంజిన్లే గో ఫస్ట్‌ వ్యాపారానికి కీలకమైనవని, వాటిని తీసివేస్తే ’కంపెనీ మరణానికి’ దారి తీస్తుందని ఎన్‌సీఎల్‌టీ తెలిపింది. దీని వల్ల రుణభార సమస్య పరిష్కారానికి అవకాశమే లేకుండా పోతుందని వివరించింది. మరోవైపు తమ విమానాలు, ఇంజిన్లను తనిఖీ చేసుకునేందుకైనా అనుమతినివ్వాలంటూ లెస్సర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్‌సీఎల్‌టీ తోసిపుచి్చంది. విమానాల భద్రతా ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పరిష్కార నిపుణుడికి (ఆర్‌పీ) ఉంటుందని స్పష్టం చేసింది. మే 3 నుంచి గో ఫస్ట్‌ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement