ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

Narayana Murthy Expresses Regret Infosys Employees - Sakshi

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 'యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' బుక్ ఆవిష్కరించిన తరువాత, సంస్థలో చాలా మంది ఉద్యోగులకు తగినన్ని రివార్డ్ ఇవ్వలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని వెల్లడించారు.

ఇన్ఫోసిస్‌ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని, వీరికి కంపెనీ కో-ఫౌండర్లకు ఇచ్చినంత స్టాక్‌ను ఇవ్వలేకపోయానని చింతించారు. ఉద్యోగులు కూడా సంస్థ వల్ల ప్రయోజనాలను పొందాలని, నేను కోరుకుంటున్నానని నారాయణ మూర్తి కోరారు.

వారానికి 85 నుంచి 90 గంటలు
1981లో పూణేలో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు బెంగళూరులో ఉంది. నాతో (నారాయణ మూర్తి) పాటు, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, శిబులాల్, కే దినేష్, ఎన్రాఎస్ ఘవన్, అశోక్ అరోరా సంస్థ ఏర్పాటుకు సహకరించారు. ప్రారంభంలో నేను వారానికి 85 నుంచి 90 గంటలు పనిచేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్‌.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్‌!

టాయిలెట్స్ శుభ్రం చేయడంపై నారాయణమూర్తి వ్యాఖ్యలు
ఇటీవల నారాయణ మూర్తి తన టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, ఎందుకు శుభ్రం చేయాలనే విషయాలను వెల్లడిస్తూ.. నా పిల్లలకు కూడా మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పినట్లు తెలిపారు. చాలామంది ధనవంతుల పిల్లలు ఇప్పటికి కూడా టాయిలెట్లను శిబిరం చేసుకోవడం మన పనికాదని భావిస్తారని అది కరెక్ట్ కాదని అన్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top