ఇక ఎన్‌ఎస్‌ఈ సోషల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజీ

Mumbai: Sebi Approves Nse Social Stock Exchange - Sakshi

న్యూఢిల్లీ: ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ సోషల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజీ ఏర్పాటుకు ముందస్తు అనుమతి పొందింది. ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ అందుకుంది. దీంతో ఎస్‌­ఎస్‌ఈ పేరుతో విడిగా ఒక విభాగాన్ని నెలకొల్పేందుకు కృషి చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది.

ఈ ప్లాట్‌ఫామ్‌ సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌లకు గరిష్ట లబ్దిని అందించగలదని విశ్వసిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సస్టెయిబుల్‌ డెవలప్‌మెంట్‌ లక్ష్యాలకు చేయూతనివ్వగలదని తెలియజేశారు. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్, టెక్ని కల్‌ గ్రూప్‌ సిఫారసులమేరకు జులైలోనే ఎస్‌ఎస్‌ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దేశీయంగా ఎస్‌ఎస్‌ఈ కొ త్త ఆలోచనకాగా.. ప్రయి వేట్, నాన్‌ప్రాఫిట్‌ రంగాలకు పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించడం ద్వారా సేవలందించనుంది. కాగా.. అక్టోబర్‌లో బీఎస్‌ ఈసైతం ఎస్‌ఎస్‌ఈ ఏర్పాటుకు సూత్ర ప్రాయ అనుమతిని పొందినట్లు వెల్లడించిన విషయం విదితమే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top