సముద్రంపై మరోసారి అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు | Sakshi
Sakshi News home page

సముద్రంపై మరోసారి అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు

Published Wed, May 22 2024 11:39 AM

Mukesh and Nita Ambani are set to host a second pre wedding bash for their son Anant and Radhika

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో రెండో రౌండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమవుతున్నారు.

ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ వార్తలు ప్రచురించాయి. ఆ కథనాల ప్రకారం..ముఖేష్‌ అంబానీ-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్‌ అంబానీ తనకు కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో రెండోసారి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకలు మే 28-30 వరకు జరగనున్నాయి. అయితే ఈసారి ఏకంగా సముద్రంపైనే ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా లగ్జరీ క్రూయిజ్‌ను ఏర్పాటు చేశారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌ వరకు దాదాపు 4,380 కి.మీ దూరం ఈ ‍క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ఇందులో మొత్తం 800 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. 600 మంది సిబ్బంది వారికి ఏర్పాట్లు చేస్తారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.

మే28 నుంచి జరగబోయే రెండో రౌండ్‌ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు అతిథుల జాబితా సిద్ధమైంది. అందులో సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, రణబీర్ కపూర్, అలియా భట్ వంటి సినీ ప్రముఖలతోపాటు చాలామంది వ్యాపార దిగ్గజాలు, అంబానీ కుటుంబ సన్నిహితులు హాజరవుతున్నట్లు మీడియా సంస్థల ద్వారా తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement