హైదరాబాద్‌లో మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌.. కుదిరిన ఒప్పందం

Mobile Premier League To Setup Game Development Centre In Hyderabad - Sakshi

పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్‌ నగరం దూసుకుపోతుంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు అనేకం ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వరుసలో మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ అనే గేమింగ్‌ కంపెనీ కూడా చేరింది.

మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌

దేశంలోనే ఈ మొబైల్‌ ఈ స్పోర్ట్‌, మొబైల్‌ గేమింగ్‌ ఫ్లాట్‌ఫార్మ్‌గా మెబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌కి గుర్తింపు ఉంది. ఈ కంపెనీకి చెందిన యాప్‌లో గేమ్స్‌ ఆడటం ద్వారా అనేక రివార్డులు, క్యాష్‌ ప్రైజులు గెలుచుకోవచ్చు. ప్రతీ రోజు వందల కొద్ది గేమ్స్‌, టోర్నమెంట్స్‌ అందుబాటులో ఉంటాయి. వేలాది మంది ఈ ఫ్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చి ఈ స్పోర్ట్స్‌ , గేమ్స్‌ ఆడుతున్నారు.  ఎంపీఎల్‌కి ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. యూఎస్‌ఏ, చైనీస్‌ గేమింగ్‌ కంపెనీలకు ధీటుగా ఎదుగుతోంది.

డెవలప్‌మెంట్‌ సెంటర్‌
తాజాగా హైదరాబాద్‌ నగరంలో గేమింగ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముందుకు వచ్చింది. 500ల మంది ఉద్యోగులతో అతి త్వరలో ఈ సెంటర్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, ఎంపీఎల్‌ సీఈవో సాయి శ్రీనివాసులు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.

టాస్క్‌తో కూడా
తమ స్వంత సెంటర్‌ ద్వారా గేమ్స్‌ని డెవలప్‌ చేయడంతో పాటు తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)తో మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ కలిసి పని చేస్తుంది. టాస్క్‌లో ఉన్న వారికి ఈ స్పోర్ట్స్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, యానిమేషన్‌ రంగాల్లో అవసరమైన శిక్షణ అందివ్వనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top