తెలంగాణలో మరో భారీ పెట్టుబడి 

Electronic Company SKY Worth Made Agreement With Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్కైవర్త్ తన ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఉన్నతాధికారుల సమక్షంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

రాష్ట్రంలో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్కై వర్త్ కంపెనీ తెలంగాణలో దశల వారీగా పెట్టుబడులను పెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ. 700 కోట్లతో 50 ఎకరాలలో  అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును  ఏర్పాటు చేయబోతుంది.  దీంతో దేశంలో ఉన్న అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల్లో స్కైవర్త్‌ ఒకటిగా నిలవనున్నది. ఇప్పటికే  స్కైవర్త్ అందిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లతో మెట్జ్ బ్రాండ్ ఎల్ఈడి టీవీలు అందుబాటులో ఉన్నాయి. తాజా విస్తరణలో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీల తయారీ, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను ఉత్పత్తి చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top