రేషన్‌ షాపుల్లో మినీ ఎల్‌పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన

Mini LPG Cylinders Available At Ration Shops Said By Piyush Goya - Sakshi

ఢిల్లీ:  రేషన్ దుకాణాల ద్వారా మినీ-ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్‌ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట​‍్టు తెలిపారు. 

రేషన్‌ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించామని మంత్రి తెలిపారు. అయితే రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉందన్నారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు రేషన్ షాపుల్లో మినీ-ఎల్పీజీ అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. రేషన్‌ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్. రెడ్డెప్పలు అడిన  ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. 
 

చదవండి:రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top