సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి

Micro credit companies need government support - Sakshi

ఎంఫిన్‌ సీఈవో అలోక్‌ మిశ్రా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బడుగు వర్గాల రుణ అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మైక్రోఫైనాన్స్‌ రంగానికి ప్రభుత్వం తగు తోడ్పాటు అందించాలని సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) సమాఖ్య ఎంఫిన్‌ సీఈవో అలోక్‌ మిశ్రా తెలిపారు. ఎంఎఫ్‌ఐలకు రుణ హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐల కోసం ప్రత్యేకంగా రీఫైనాన్స్‌ సదుపాయం కల్పించడం, ఇండియా మైక్రోఫైనాన్స్‌ ఈక్విటీ ఫండ్‌ (ఐఎంఈఎఫ్‌) ద్వారా ఈక్విటీపరమైన సహాయం పెంచడం తదితర రూపాల్లో మద్దతు కల్పించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు.

(ఇదీ చదవండి: అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు)

తద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్‌ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 2021-22 ఇండియా మైక్రోఫైనాన్స్‌ రివ్యూ ప్రకారం 2025-26 నాటికి సూక్ష్మ రుణాల మార్కెట్‌ రూ. 25 లక్షల కోట్లకు చేరవచ్చనే అంచనాలు నెలకొన్నట్లు మిశ్రా చెప్పారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 633 జిల్లాల్లో ఎంఎఫ్‌ఐలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top