మెటా,ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు భారీ షాక్‌!

Meta Ceo Mark Zuckerberg Announced On Paid Blue Badge For Instagram,facebook  - Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ బాటలో మెటా (facebook) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పయనిస్తున్నారు. ఇన్ని రోజులు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్ని ఉచితంగా అందించిన జుకర్‌ బర్గ్‌.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. 

ఫ్రీగా వినియోగించుకునే మెటా, ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్లు ఇకపై మరింత కాస్ట్లీగా మారనున్నాయి. ట్విటర్‌ తరహాలో మెటా సైతం.. మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లూటిక్‌ హోల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఐడీలతో ఫేస్‌బుక్‌ బ్లూటిక్‌ హోల్డర్ల అకౌంట్ల పరిశీలించి.. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెరిఫికేషన్‌ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో బ్లూ టిక్‌ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో యూజర్ల ఛార్జీలు వసూలు చేయనున్నారు. 

బ్లూ వెరిఫికేషన్‌తో ఫేక్‌ అకౌంట్ల నుంచి యూజర్లు సురక్షితంగా ఉండొచ్చని ఈ సందర్భంగా జుకర్‌ బర్గ్‌ తెలిపారు. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లలో విశ్వసనీయత పెరగడంతోపాటు రీచ్,సెక్యూరిటీ పెరుగుతుందన్నారు.ఇక మెటా ప్రకటించినట్లుగా ఐఓఎస్‌ యూజర్లు నెలకు 14.99 డాలర్లు, వెబ్‌ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top