Mercedes-Benz India records highest-ever H1 sales at 8,528 units in FY23 - Sakshi
Sakshi News home page

లగ్జరీ కార్ల జోరు : అదీ లెక్క

Published Wed, Jul 12 2023 10:15 AM

Mercedes Benz India sells 8528 units in H1 2023  - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ 2023 జనవరి-జూన్‌లో భారత్‌లో 8,528 యూనిట్లను విక్రయించింది.  అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.1.5 కోట్లకుపైగా ధర కలిగిన టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌ (టీఈవీ) వాటా 25 శాతంపైగా నమోదై 2,000 యూనిట్లకు చేరింది. 2022 జనవరి-జూన్‌తో పోలిస్తే టీఈవీల అమ్మకాలు 54 శాతం పెరిగాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

‘ఈ ఏడాది టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌ విభాగంలో అయిదు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. టీఈవీలకు  వెయిటింగ్‌ పీరియడ్‌ 6-24 నెలలు ఉన్నప్పటికీ  విక్రయాలు పెరుగుతున్నాయి. రెండవ అర్ధ భాగంతోపాటు పూర్తి ఏడాదికి మొత్తం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం. నూతన తరం జీఎల్‌సీ మోడల్‌ను మూడవ త్రైమాసికంలో పరిచయం చేస్తున్నాం. పండుగల సీజన్‌కు ముందే ఈ కారు రానుంది’ అని వివరించారు. 2022లో భారత్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి మొత్తం 15,822 యూనిట్లు రోడ్డెక్కాయి. వీటిలో 69 శాతం వృద్ధితో 3,500 పైచిలుకు టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌ ఉన్నాయి.  

Advertisement
Advertisement