Mercedes AMG GT 63 S E Performance: భారత్‌లో విడుదలైన కొత్త కారు - పూర్తి వివరాలు

Mercedes amg gt 63 s e performance india launched details - Sakshi

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో కొత్త కారు 'ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్' (AMG GT 63 S E Performance) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ వంటి విషయాలతో పాటు ధరల గురించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధర:
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది AMG పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇది 2021లోనే గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అయితే ఇప్పటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది.

డిజైన్:
కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ చూడగానే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది కొత్త ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు కలిగి, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉండటం కూడా మీరు గమనించవచ్చు. బ్యాడ్జింగ్ కొత్త ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి మరింత అట్రాక్టివ్‌గా ఉంటాయి.

(ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?)

ఫీచర్స్:
ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ డ్యాష్‌బోర్డ్‌లో 12.4 ఇంచెస్ డ్యూయెల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బకెట్ సీట్లు, AMG స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ ఇన్‌సర్ట్‌లు వంటి లగ్జరీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలను ఈ డిస్ప్లేల ద్వారా చూడవచ్చు.

ఇంజిన్ & పర్ఫామెన్స్:
కొత్త ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ కారు 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ పొందుతుంది. ఇది 639 హెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 204 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ రెండు కలయికతో 843 హెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే టార్క్ 1,470 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.  గంటకు 316 కిలోమీటర్లు.

ఈ సూపర్ సెడాన్‌లో 6.1kWh, 400V బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 89 కేజీల బరువుతో ఉంటుంది. ఇది మోటారుకు శక్తినిస్తుంది. దీని పరిధి 12 కిమీ వరకు వస్తుంది. కానీ EV మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 12 కిలోమీటర్లు. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్‌లు & ఫోర్ లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌అందుబాటులో ఉంటుంది. రెండోది కొన్ని పరిస్థితులలో వన్-పెడల్ డ్రైవింగ్‌ను కూడా అనుమతిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top