పెట్రోలు బాధల నుంచి ఉపశమనం.. మారుతి నుంచి సీఎన్‌జీ వేరియంట్‌ | Maruti Suzuki Launch Celerio CNG Variant In Indian Market | Sakshi
Sakshi News home page

మారుతీ సెలెరియో ఎస్‌–సీఎన్‌జీ వేరియంట్‌

Jan 18 2022 8:42 AM | Updated on Jan 18 2022 8:52 AM

Maruti Suzuki Launch Celerio CNG Variant In Indian Market - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెలెరియో సీఎన్‌జీ వేరియంట్‌ను పరిచయం చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.58 లక్షలు. ఎస్‌–సీఎన్‌జీ టెక్నాలజీతో కె–సిరీస్‌ 1.0 లీటర్‌ ఇంజన్‌ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 35.6 కిలోమీటర్లు. ట్యాంక్‌ సామర్థ్యం 60 లీటర్లు.

అంత క్రితం విడుదలైన సెలెరియో కార్లలో ఎస్‌–సీఎన్‌జీ వేరియంట్‌ యూనిట్ల వాటా 30 శాతముంది. మారుతి సుజుకీ ఖాతాలో 8 మోడళ్లకుగాను 9,50,000 యూనిట్ల ఎస్‌–సీఎన్‌జీ వాహనాలు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో సీఎన్‌జీ విక్రయాల్లో ఏటా 22 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement