రూ. 25 వేలకే ఇన్విక్టో బుకింగ్స్ - లాంచ్ ఎప్పుడంటే? | Maruti invicto bookings start price launch date and expected price | Sakshi
Sakshi News home page

Maruti Invicto: రూ. 25 వేలకే ఇన్విక్టో బుకింగ్స్ - లాంచ్ ఎప్పుడంటే?

Jun 20 2023 6:57 AM | Updated on Jun 20 2023 9:46 AM

Maruti invicto bookings start price launch date and expected price - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మారుతీ సుజుకీ సరికొత్త యుటిలిటీ వెహికిల్‌ ఇన్విక్టో బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. వినియోగదార్లు రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. జూలై 5న ఈ కారు భారత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ధర రూ.20 లక్షలకుపైగా ఉండనుంది. ఇన్విక్టో రాకతో మూడు వరుసల్లో లభించే ప్రీమియం వెహికిల్స్‌ విభాగంలోకి ప్రవేశించినట్టు అవుతుందని మారుతీ సుజుకీ తెలిపింది. 

స్పోర్ట్‌ యుటిలిటీ/మల్టీపర్పస్‌ వెహికిల్‌ లక్షణాలతో కూడిన ప్రీమియం మూడు–వరుసల వాహనాన్ని కోరుకునే వినియోగదారులను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మూడు వరుసలున్న స్పోర్ట్‌ యుటిలిటీ/మల్టీపర్పస్‌ వెహికిల్స్‌ 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసేవి 1.2–1.25 లక్షల యూనిట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌ ఎంపీవీ ఆధారంగా ఇన్విక్టో రూపుదిద్దుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement