ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్! | Maruti eeco 10 lakh record sales | Sakshi
Sakshi News home page

ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!

Feb 22 2023 4:08 PM | Updated on Feb 22 2023 4:14 PM

Maruti eeco 10 lakh record sales - Sakshi

మారుతి సుజుకి ఈకో గత కొన్ని సంవత్సరాలు మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో పరుగులు పెడుతోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నివేదికల గణాంకాల ప్రకారం 'ఈకో' 10 లక్షల యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.

భారతదేశంలో మారుతి ఈకో కేవలం ప్రయాణ వాహనంగా మాత్రమే కాకుండా, వ్యాపార వినియోగాలకు కూడా ఉపయోగపడుతోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే దేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన వ్యాన్‌గా రికార్డ్ సృష్టించింది. ఇది 5 సీటర్, 7 సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి దాదాపు 13 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

మార్కెట్లో వ్యాన్ అమ్మకాలలో మారుతి ఈకో 94 శాతం వాటా కలిగి ఆ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి 5 లక్షల యూనిట్లను విక్రయించడానికి 8 సంవత్సరాలు పడితే, మరో 5 లక్షల కార్లు విక్రయించడానికి ఐదేళ్ల కంటే తక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈకో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది.

(ఇదీ చదవండి: ముదురుతున్న ఎండలు: కారుని కాపాడుకోడం ఎలా? ఇవిగో సింపుల్ టిప్స్‌)

మారుతి సుజుకి ఈకో 1.2-లీటర్, K12C, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ కలిగి 80 బిహెచ్‌పి పవర్ & 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. CNG వెర్షన్ 71 బిహెచ్‌పి, 95 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ మోడల్ 20.20 కిమీ/లీ మైలేజ్ అందిస్తే, CNG మోడల్ 27.05 కిమీ/కేజీ అందిస్తుంది.

'మారుతి ఈకో'లో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి 11 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement