5 రోజుల ర్యాలీకి బ్రేక్‌- నష్టాలతో షురూ | Market in consolidation mode- Psu Banks up | Sakshi
Sakshi News home page

5 రోజుల ర్యాలీకి బ్రేక్‌- నష్టాలతో షురూ

Dec 30 2020 10:09 AM | Updated on Dec 30 2020 10:44 AM

Market in consolidation mode- Psu Banks up - Sakshi

ముంబై, సాక్షి: వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 81 పాయింట్లు క్షీణించి 47,532కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్లు తక్కువగా 13,911 వద్ద ట్రేడవుతోంది. గత 20 సెషన్లలో 14సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,808-47,462 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఆటో 0.3 శాతం చొప్పున పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకింగ్‌, ఫార్మా1-0.6 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, ఐషర్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీసీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం 3.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, సిప్లా, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, యాక్సిస్‌, హిందాల్కో, బ్రిటానియా, ఎల్‌అండ్‌టీ, ఆర్‌ఐఎల్‌ 1-0.5  శాతం మధ్య బలహీనపడ్డాయి.

జీఎంఆర్‌ జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో జీఎంఆర్‌, సెయిల్, బాలకృష్ణ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, పెట్రోనెట్‌, నౌకరీ, కమిన్స్‌ 4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు నాల్కో, బీవోబీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, పీఎన్‌బీ, అరబిందో, పీఎఫ్‌సీ, కెనరా బ్యాంక్‌, సన్‌ టీవీ, ఆర్‌ఈసీ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,130 లాభపడగా.. 1,158 నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement
 
Advertisement
Advertisement