వచ్చే రెండేళ్లలో పెంపుడు శునకాల మార్కెట్‌ ఎంతంటే..

 The Market Is Big For Pet Dogs In Next Two Years - Sakshi

ఇంటికి వెళ్లగానే బుజ్జి అడుగులతో ప్రేమగా మీదకు దూకే చిన్న కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే చూసుకుంటాం. ఎంత టెన్షన్‌లో ఉన్నా వాటిని చూడగానే ఆంతా ఆవిరైపోతుంది. అయితే పెట్‌డాగ్స్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్‌, వాటికి వేసే బట్టలు, వాటికి వాడే క్యాస్టుమ్స్‌, వైద్యం..ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతుంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్‌ ద్వారా దేశంలో దాదాపు రూ.6వేల కోట్లు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్‌ సర్వీస్‌ కిందకు వస్తాయి. పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా  వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్‌ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి. కొందరు ఆన్‌లైన్‌లో లేదా స్టోర్‌లో పెట్‌ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు. స్టూడియోలో లేదా మంచి లొకేషన్‌లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు. యజమానులు, ఇంటికి వచ్చేవారితో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. 

ఇదీ చదవండి: 25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే

దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా 6లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.2వేలకోట్లు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 13.9% వృద్ధి చెందుతోంది. 2025 నాటికి దాదాపు రూ.6వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పెట్‌డాగ్స్‌ సంఖ్య ఈ కింది విధంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top